శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:29 IST)

ఆ వృద్ధురాలు పెన్షన్ కోసం రాలేదు, ఇంటివద్దే మరణించారు, అవాస్తవాలు నమ్మొద్దు: పల్నాడు జిల్లా కలెక్టర్

Palnadu Collector
కర్టెసి-ట్విట్టర్
పెన్షన్లు కోసం ఎండల్లో పడిగాపులు కాస్తూ పలువురు వృద్ధులు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాము నడవలేని, కదల్లేనివారికి, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని చెబుతున్నారు. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నెహ్రూ నగర్‌కు చెందిన వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి మరణించారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు. ఆమె ఆరోగ్యం బాగాలేదు. రెండురోజులుగా ఇంటిలోనే వున్నారు. ఆరోగ్యం విషమించి ఇంటివద్దే ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంపిడివో దుర్గ ధృవీకరించారు. కనుక అవాస్తవాలను ఎవ్వరూ నమ్మవద్దు.
 
కదల్లేనివారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే పెన్షన్ ఇస్తాము. సచివాలయం సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చాము. సోషల్ మీడియా, ఛానళ్లులో వచ్చే వార్తలు అవాస్తవం.నడవలేని పరిస్థితుల్లో వున్నవారు సచివాలయం వద్దకు రావద్దు. రాబోయే 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఆందోళన, అధైర్యం పడవద్దు. అవాస్తవాలను నమ్మవద్దు అని చెప్పారు.