శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 మే 2020 (16:07 IST)

గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ (26) కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రకటించారు.

దినపత్రికల్లో ఈ వార్తను చూసిన వెంటనే సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు.

విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు.

గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనూరాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు.