1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 మే 2021 (09:43 IST)

గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత

గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గణపవరం గ్రామంలో అత్యధికంగా 43.03 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రెండో అత్యధిక ఉష్ణోగ్రత బాపట్ల పట్టణంలో 42.4 డిగ్రీలుగా నమోదైంది. అలానే భట్టిప్రోలులో 42.37, తెనాలిలో 42.35, అమర్తలూరులో 42.33, వేమూరులో 42.3, వట్టిచెరుకూరులో 42.28, వినుకొండలో 42.15, మంగళగిరి మండలంలోని నూతక్కిలో 42.1, పొన్నూరు మండలంలోని ములుకుదురులో 42.08, గురజాల మండలంలోని జంగమేశ్వరంలో 41.63 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. అలానే వడగాడ్పులు కూడా పలు ప్రాంతాల్లో వీచాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల మధ్యనే నమోదైంది.

బొల్లాపల్లి మండలంలోని బండ్లమోటులో 31.29, పెదకాకాని మండలంలోని నంబూరులో 32.16, అచ్చంపేటలో 32.23, నడికుడిలో 32.32, రేపల్లెలోని మృత్యుంజయపాలెంలో 32.74, దుర్గి మండలంలోని ముటుకూరులో 32.83 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.