గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:11 IST)

ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం

గత రెండు వారాలుగా ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పట్టాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్  చీఫ్ సెక్రెటరీ కే.ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. మాస్క్, సామాజిక దూరం పాటించడంలో గతంతో పోల్చితే ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.

ప్రవేట్ ఆసుపత్రిలో ఎక్కువ ఫీజులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం, అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆధారాలు మాకు పంపితే, తక్షణం దానిని సీజ్ చేస్తాం, రాష్ట్రంలో అధిక ఫీజులను వసూలు చేసిన 26 ప్రవేట్ ఆసుపత్రులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం, ప్రభుత్వం ఆదేశాలను అన్ని ప్రవేట్ ఆసుపత్రులు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.  

పాత్రికేయుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్  చీఫ్ సెక్రెటరీ కే.ఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 19 నుంచి 26 వరకు అదేవిధంగా సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు  ఐదు పారామీటర్స్ కంపార్ చేశామన్నారు. ఆ ఏడు రోజుల్లో యావరజ్ తీసుకోవడం జరగిందిన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు, కరోనా మరణాల సంఖ్య, మరియు కోవిడ్ పరిస్థితులను అంచనా వేయడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో 260 ఆసుపత్రుల్లో 38,000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిదంగా ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 400 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కల్గిన మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందుబాటులో ఉంచామన్నారు. యునెస్కో, స్వఛ్చాంధ్ర కార్పొరేషన్, మెప్మా, ఎన్జీవోల సహకారంతో మాస్కింగ్ క్యాంపెయిన్ ను పెద్దఎత్తున చేపట్టామన్నారు. దీని ద్వారా ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నామన్నరు. 

రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి అనుసరిస్తున్న వ్యూహం, కరోనా దశ కూడా దీని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆగస్టు 19-26 మధ్య ప్రతిరోజూ 57,557 కరోనా పరీక్షలు చేయగా, సెప్టెంబర్ 19-26 మధ్య ప్రతి రోజూ 70,816 పరీక్షలు చేస్తే, ఈ మధ్య కాలంలో సుమారు 13,000 వరకు పరీక్షలు చేసే సామర్ధ్యం పెరిగిందన్నారు.

ఆగస్టులో వారం రోజుల్లో పాజిటివ్ కేసులు సంఖ్య 9,636 ఉంటే, సెప్టెంబర్ లో వారం రోజుల్లో 7,236  ఉండగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,400 కి తగ్గాయన్నారు. ఈ కాలంలో 25 శాతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా, 25 శాతం కోవిడ్ టెస్టులు చేసే సామర్ద్యం పెరిగిందన్నారు.  పాజిటివిటీ రేటు నెలరోజుల్లో 16.73 శాతం నుంచి సెప్టెంబర్ లో 10.22 శాతం కు తగ్గి నెలరోజుల్లో మొత్తానికి 6.5 శాతానికి  తగ్గిందన్నారు.

మరణాల రేటు ఆగస్టులో రోజుకి 91 మరణాలు ఉండగా, సెప్టెంబర్ లో రోజు కి 51 మరణాలకు (44 శాతం తగ్గింది) తగ్గాయన్నారు. ఫెటాలిటీ రేటు ఆగస్టు నెలలో వారానికి 0.94 నుంచి సెప్టెంబర్ లో 0.7 కి తగ్గి ఈ కాలంలో మొత్తానికి 0.24 కి తగ్గిందన్నారు. 

బైవీక్లీ మార్పు అంటే 15 రోజులకు ఇప్పటి వరకు 30 ఆగస్టు నుంచి 12 సెప్టెంబర్ వరకు 15 రోజులపాటు, సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 26 వరకు 15 రోజుల పాటు తీసుకోవడం చూస్తే పాజిటివ్ కేసులు మొదటి పక్షంలో 1, 42, 356 రాగా, రెండవ పక్షంలో (సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 26 వరకు) 1,08,551 కేసులు వచ్చి మొత్తానికి  ఈ నెలలో 33,805 (23.75 శాతానికి తగ్గాయి) కేసులు తగ్గాయన్నారు.

పాజిటివిటీ రేట్ 15.25 శాతంగా ఉండగా రెండవ పక్షంలో 10.85 శాతంగా ఉందన్నారు. సుమారుగా దాదాపుగా 5 శాతంగా ఈ కాలంలో తగ్గిందన్నారు.  రిడక్షన్ పాజిటివిటీ  28 శాతం గా ఉందన్నారు. మరణాల రేటు మొదటి పక్షంలో 1028 ఉండగా, రెండవ పక్షంలో  796 గా ఉందని, ఈ కాలంలో 232 కు మరణాల సంఖ్య  తగ్గిందన్నారు.

నిన్నటి రోజు 66,121 వేల టెస్టులు నిర్వహిస్తే 5,487 పాజిటివ్ కేసుల నమోదు కావడం మంచి పరిణామన్నారు. 8.3 శాతం పాజిటివిటీ రేటు వచ్చిందన్నారు. మరణాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు.  ఈ రెండు వారాలు చూస్తే కరోనా కేసులతో పాటు, రాష్ట్రంలో చాలా జిల్లాలో పాజిటివిటీ రేటు క్రమేపీ తగ్గిందన్నారు. 

సెప్టెంబర్ నెలలో రెండు వారాలుగా‌ కోవిడ్ పాజిటివ్ సంఖ్య, మరణాలు తగ్గాయన్నారు. అయినా కరోనా పట్ల ప్రజలు చెతన్యంగా, అప్రమత్తంగా వుండాలన్నారు. ఆగష్టు మాసంలో కంటే సెప్టెంబరు నెలల్లో టెస్టులు పెరిగాయన్నారు.. 25 శాతం టెస్టులు పెరిగినా 23 శాతం పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. ఆగష్టు లో 14 రోజుల్లో  91 మరణాలు వుంటే, సెప్టెంబరు లో 14 రోజుల్లో  51 మరణాలు తగ్గగా, ఈ కాలంలో 40 మరణాలు తగ్గాయన్నారు.

నిన్నటి రోజు వరకు మరణాల సంఖ్య 35 గా వచ్చాయన్నారు. గత వారం రోజుల్లో 60 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాలలో వుండగా, 40 శాతం పట్టణ ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మరణాలు కూడా 52 శాతం గ్రామీణ ప్రాంతాలలో వున్నాయన్నారు. పట్టణ ప్రాంతాలలో కోవిడ్ నమోదు సంఖ్యల సంఖ్య తగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు వస్తున్నాయన్నారు. కేసులు తగ్గుతున్నా కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయని, దీని పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, అదేవిధంగా ఏ ప్రాంతంలో కేసులు ఎక్కువ వస్తున్నాయి, అనేది క్షేత్ర స్థాయిలో నిఘా పెట్టమని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. హోం ఐసొలేషన్ పై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టామని, గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆగస్టులో కంటే సెప్టెంబర్ లో టెస్ట్ లు పెరిగాయని, సెప్టెంబర్ లో టెస్ట్ లు పెరిగినప్పటికి పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు.

గత వారం నుండి 60 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చాయని, 40 శాతం కేసులు పట్టణ ప్రాంతాల్లో వచ్చాయని, 58 శాతం మరణాలు  గ్రామీణ ప్రాంతాల్లో, 42 శాతం మరణాలు పట్టణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.