శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (18:10 IST)

తిరుమల బ్రహ్మోత్సవాలు... తిరుమలకు నిమిషానికో బస్సు...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిమిషానికో బస్సును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు తిరుపతి ఆర్ఎం చెంగల్ రెడ్డి. బ్రహ్మోత్సవాల నుంచి 165 కొత్త బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులలో నడుపుతామని చెప్పారు. సాధారణ రోజుల్లో 1600 ట్రిప్‌లను

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిమిషానికో బస్సును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు తిరుపతి ఆర్ఎం చెంగల్ రెడ్డి. బ్రహ్మోత్సవాల నుంచి 165 కొత్త బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులలో నడుపుతామని చెప్పారు. సాధారణ రోజుల్లో 1600 ట్రిప్‌లను తిరుపతి నుంచి తిరుమలకు తిరుమల నుంచి తిరుపతికి నడుపుతామని బ్రహ్మోత్సవాల సమయంలో 2,600 ట్రిప్పులను నడపేందుకు సిద్థంగా ఉన్నామని చెప్పారు. ఒక్క గరుడ సేవ రోజు, గరుడసేవ మరుసటి రోజు 3,600 ట్రిప్పులను తిరుమల-తిరుపతి, తిరుపతి నుంచి తిరుమలకు నడుపనున్నట్లు ఆర్ ఎం చెంగల్ రెడ్డి తెలిపారు.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సహాయక్ పేరుతో విద్యార్థులు భక్తులకు సేవ చేస్తారని చెప్పారు కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీనివాస్. తొమ్మదిరోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవ చేసేందుకు కొంతమంది విద్యార్థులు ముందుకు వచ్చారని, వారిని దృష్టిలో ఉంచుకుని గరుడ సహాయక్ పేరుతో సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నామన్నారు. పోలీసుల పర్యవేక్షణలో గరుడ సహాయక్ విద్యార్థులు విధులను నిర్వర్తిస్తారన్నారు. వాహనసేవ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరిస్తారని చెప్పారు. విద్యార్థులకు లోగో, టోపీ, జాకెట్స్ ను కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ మహంతిలు అందజేశారు.