శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (10:09 IST)

సలహాలు ఇచ్చేందుకు పదవులు ఎందుకు.. పదవిని స్వీకరించబోను : చాగంటి

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు పదవులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సలహాలు ఇచ్చేందుకు పదవులు అక్కర్లేదని అన్నారు. అందువల్ల తాను పదవులు స్వీకరించబోనని స్పష్టంచేశారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలదారుడిగా చాగంటిని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వహక కమిటి నియమించింది. అయితే, ఈ సలహాదారు పదవిని స్వీకరించేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. సలహాలు ఇచ్చేందుకు పదవులు అక్కర్లేదని స్పష్టం చేశారు. అందువల్ల తాను పదవులు స్వీకరించబోనని స్పష్టం చేశారు. 
 
జనవరి 20వ తేదీన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వహక కమిటి చాగంటి కోటేశ్వర రావును తితిదే ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. దీనిపై చాగంటి ఒక వీడియో సందేశ రూపంలో స్పందించారు. స్వామి సేవకు తాను ఎపుడూ సిద్ధమేనని, తనకు పదవులు అక్కర్లేదని స్పష్టం చేశారు. పదవి ఇస్తేనే ఆ పని చేస్తాని ఎందుకు అనుకున్నారని ప్రశ్నించారు. 
 
తన ఊపిరి స్వామి సేవకు అంకితమని అందుకు తాను పనికివస్తే తన జీవితం ధన్యమైనట్టేనని చెప్పారు. కాబట్టి పదవిని స్వీకరించలేనని స్పష్టం చేసారు. ఈ పని చేసిన పెట్టాలని తితిదే తనను అడిగితే, తనకు అవకాశం ఉంటే వెంటనే వెళ్లి చేస్తానని చాగంటి స్పష్టం చేశారు. అయితే, తితిదే సలహాదారు పదవిని స్వీకరించలేనన్న చాగంటి వ్యాఖ్యలపై తితిదే స్పందించలేదు.