గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (12:35 IST)

డిజిటల్‌ మీటర్‌ వద్దు.. 95 మంది ఎత్తు మాన్యువల్‌గా కొలవండి

డిజిటల్‌ మీటర్‌ సాయంతో కాకుండా పాత పద్ధతిలో మాన్యువల్‌గా ఎత్తు, ఛాతీ పరీక్షలు నిర్వహించాలని పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
హైకోర్టు అనుమతి నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. 
 
ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని జస్టిస్‌ వి సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో మెయిన్స్‌ యథాతథంగా నిర్వహించాలని, అర్హత సాధించిన వారిని తదుపరి దశకు అనుమతించాలని ఆదేశించారు.
 
2019లో మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించినప్పుడు అర్హత సాధించి, 2023లో అనర్హులైన అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో... ఆ 95 మందికి ఎత్తును తిరిగి కొలవాలని హైకోర్టు పేర్కొంది.