బడుగు, బలహీన వర్గాల వారిపై దాడిని సహించం: జగన్

cm in police programme
ఎం| Last Updated: బుధవారం, 21 అక్టోబరు 2020 (09:34 IST)
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు. ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం ప్రోగ్రాంకి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమంలో సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

బడుగు, బలహీన వర్గాల వారిపై దాడిని సహించం: జగన్
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు అమరవీరులను స్మరించుకునే రోజు. ప్రాణాలు వదిలిన ప్రతి పోలీస్ కుటుంభానికి మన దేశం జేజేలు పలుకుతుంది.

మనం నిష్టగా నిర్వహించాల్సిన కార్యక్రమం. తలసరి ఆదాయం చూసి దేశ అభివృద్దిని అంచనా వేస్తారు. కానీ నేరాల రేటు తగ్గడం కూడా చాలా ముఖ్యం. రాత్రికి రాత్రి అది జరగదు, కానీ తగ్గించే ప్రయత్నం మన ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది.

లా అండ్ ఆర్డర్ ప్రభుత్వానికి అతి ముఖ్య అంశం. పిల్లలు, మహిళలు, వృద్దల భద్రత అతి ముఖ్యం. బడుగు, బలహీన వర్గాల వారిపై దాడిని సహించం. అలాంటి వారిపై చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అవతల ఎంత పెద్ద వారు అయినా వదిలే ప్రసక్తే ఉండకూడదు.

మహిళల భద్రత కోసం దిశ బిల్లు తెచ్చాం. దిశ బిల్లు త్వరలో ఆమోదం పొందుతుంది అని ఆశిస్తున్నా. పోలీసుల కష్టం నాకు తెలుసు. కరోనా సమయంలో ఏ స్థాయిలో పోలీసులు పని చేశారో అందరికీ తెలుసు.

టెక్నాలజీ విసిరే సవాళ్లు, కోవిడ్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీలు, ఇసుక, మద్యం అక్రమ రవాణా లాంటివి అడ్డుకోవడానికి పడే కష్టం నాకు తెలుసు. ఏడాదికి 6500 పోలీస్ పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపాం. పోలీసు అమరవీరుల కుటుంబాలకు మంచి జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.దీనిపై మరింత చదవండి :