శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 5 మే 2018 (17:54 IST)

ఈ మజ్జిగ ఇంత పుల్లగా వున్నాయేమిటండీ... తితిదే ఛైర్మన్ అసహనం(Video)

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పారు. అలాగే వంటశాలలు, పాల బాయిలర్‌లు పరిశీలించి ఆలయం వద్దకు చేరుకొని భక్తులకు ఎండలో కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ వెయ్యాలని సూచించారు. 
 
అలాగే క్యూ లైన్లలో వేచి వుండేవారికి గాలి ఆడేందుకు ఎయిర్ కూలర్స్ బిగించాలనీ, అన్నిచోట్ల పరిశుభ్రత ముఖ్యమని తెలియజేశారు. మరుగుదొడ్లు చాలా పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులే మనకు దైవ సమానులని వారికి ఎటువంటి ఆటంకం జరగకుండా చూసుకునే బాధ్యత మనదని తెలియచేశారు. చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు బోర్డ్ మెంబర్ చల్లా రామచంద్ర రెడ్డి తదితరులు వున్నారు. చూడండి వీడియోలో...