మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:14 IST)

నవంబరు 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

నవంబర్ 20వ తేదీ నుంచి తుంగభద్ర నది పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు లెక్టరేట్‌ నుంచి సెంట్రల్‌ ప్లాజా వరకు ప్రధాన రోడ్డు దుస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తుంగభద్ర పుష్కరాలపై  శ్రద్ధ లేదని ఆరోపించారు. నిత్యం భారీగా వాహనాలు వెళ్లే  మెయిన్‌రోడ్డు గుంతల పడినా జిల్లా అధికారులకు గాని, వైసీపీ నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు.

ఘాట్ల నిర్మాణంలో వైసీపీ నాయకులు బినామీ కాం ట్రాక్టర్లను నియ మించుకునేందుకే టెండర్లు పూర్తికాలేదని ఆరోపించారు.