బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జులై 2023 (16:06 IST)

నైరుతి రుతుపవనాల ప్రభావం - ఏపీలో వచ్చే రెండు రోజులు వర్షాల

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, కాకినాడ, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పల్నాడు, చిత్తూరు, కృష్ణ, అన్నమయ్య, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కోనసీమ, బాపట్ల, అల్లూరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
అదేవిధంగా ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తాయని వివరించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
బాలికతో 45 యేళ్ల వ్యక్తి వివాహం... 
 
తెలంగాణ రాష్ట్రంలో ఓ బాల్య వివాహం జరిగింది. 13 యేళ్ల బాలికను 45 యేళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తికి మొదటి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇపుడు ఆయన 13 యేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
జిల్లాలోని నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 యేళ్ల మైనర్ బాలికను సాయిబ్ రావు అనే 45 యేళ్ల వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అయితే, సాయిబ్ రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం తనకంటే తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
 
దీనీపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునే సరికి.. తన భార్యను తీసుకుని సాయిబ్ రావు అక్కడ నుంచి పరారైపోయాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న సాయిబ్ రావు దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.