ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (13:45 IST)

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

current shock
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాముల‌లంక గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. 
 
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
 
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.