బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (08:14 IST)

మరణంలోనూ వీడని బంధం

కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ వృద్ధ దంపతులు మరణంలోనూ ఒకరిని వీడి ఒకరు ఉండలేకపోయారు. భర్త మరణించిన కొన్ని గంటలకు భార్య కూడా ప్రాణాలు విడిచింది.

విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ముళ్ళు నరసింహులు(70) బుధవారం రాత్రి మరణించాడు. ఎంతో ఇష్టంగా చూసుకునే భర్త ఇక లేరని తెలిసి భార్య గురమ్మ(69) గుండెలవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు ఎంతగా ఓదార్చినా ఏకధాటిగా విలపిస్తూనే ప్రాణాలు వదిలింది.

ఈ విషయం తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మృతదేశాలను గురువారం ఉదయం శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నరసింహులు, గురమ్మలకు ముగ్గురు పిల్లలతో పాటు, మనుమలు, మనమరాలు ఉన్నారు.