ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:31 IST)

జర్నలిస్టులకు ఏప్రిల్10వ తేదీ వరకే వాక్సినేషన్

విజయవాడ : ఆంధ్రా హాస్పిటల్స్‌లో లయన్స్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్, ఏపీయూడబ్లూజే సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కోవిడ్ వాక్సిన్ ఈనెల 10 వతేదీ వరకూ మాత్రమే జరుగుతుందని ఏపీయూడబ్లూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్య దర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా తొలి డోస్ ను ఇపుడు వేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు ఇంతవరకూ ఎలాంటి డోస్ వేయించుకోని వారు వారి కుటుంబసభ్యులతో తప్పనిసరిగా ఈ తొలి కోవిడ్ వాక్సిన్ డోస్‌ను ఏప్రిల్ 10వ తేదీలోగా వేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.