ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 12 మే 2021 (13:32 IST)

లేఖలు రాస్తూ కూర్చుంటే రాష్ట్రానికివ్యాక్సిన్లు రావు: మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు

రాజకీయంగా చంద్రబాబునాయుడని ఎదుర్కోలేని ప్రభుత్వం ఆయనపై, నారాలోకేశ్ పై తప్పుడు కేసులు బనాయిస్తోంద ని, అన్నిరాష్ట్రాలు వ్యాక్సిన్లకొనుగోలుకు పోటీపడుతుంటే, ఈ ప్రభుత్వం కేవలంలేఖలురాస్తూ కూర్చుందని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
 
వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రం 28వస్థానంలో ఉందని, అక్రమ, అవినీతి సంపాదనపై చూపుతున్న శ్రద్ధను, ప్రజలప్రాణాలు కాపాడటంపై పాలకులు ఎందుకు చూపడంలేదని ఆంజనే యులు ప్రశ్నించారు. అక్రమసంపాదనపై పెట్టిన శ్రద్ధ, దృష్టిని ప్రజలపై పెట్టిఉంటే, నేడు రాష్ట్రంలో ఇన్ని మరణాలు సంభ వించేవికావన్నారు. టీడీపీనేతలపై  కేసులుపెట్టడంలోచూపు తున్న శ్రద్ధలో ఒక్కశాతమైనా ప్రజలను కాపాడటంపై పాల కులుచూపితే బాగుండేదని ప్రజలే అనుకుంటున్నారు.

పాకిస్థాన్ టెర్రరిస్ట్ కైనా కాస్త దయాదాక్షిణ్యం, మానవత్వం ఉంటుందేమోగానీ, ఈప్రభుత్వానికి ఎక్కడా మచ్చుకైనా అవి కనిపించడంలేదని ప్రజలంతా విలపిస్తున్నారన్నారు. వ్యాక్సిన్లకొనుగోలకు రూ.1600 కోట్లు అవసరమైతే, కేవలం రూ.45 కోట్లను కేటాయించడమేంటన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కులాన్ని ఆపాదించి లేఖలు రాస్తూ కూర్చుంటే, ప్రజలను ఎవరుకాపాడతారో ప్రభుత్వం చెప్పాలన్నారు. పాలకులు వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతి పక్షనేతపై తప్పుడుకేసులు పెట్టిస్తున్నారన్నారు.

పాలన చేతగాకుంటే ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఈ  దుస్థితి దాపురించడానికి ముఖ్యమంత్రికి ప్రణాళికలేకపోవడ మే కారణమని మాజీ శాసనసభ్యులు తేల్చిచెప్పారు. రోజుకి వేలమందిచనిపోవడానికి ముఖ్యమంత్రి నిర్లక్ష్యం , చేతగాని తనమే కారణమన్నారు. కరోనాతో పెద్దదిక్కునుకోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, ప్రతి కుటుం బానికి రూ.5లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయినవారి కుటుంబాలకు రూ.20లక్షల పరిహారమివ్వాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

ప్రతికుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్య త ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. తిరుపతిసహా రాష్ట్రవ్యాప్తం గాఆక్సిజన్ అందక చనిపోయినవారి కుటుంబా లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. రుయా ఘటన సహా, ఆక్సిజన్ అందక వివిధప్రాంతాల్లో సంభవించిన మరణాలపై తక్షణమే ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఘటనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
 
కరోనా రోగుల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిం చే వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి, వెంటనే చర్యలు తీ సుకోవాలన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగా ణ సీఎం కేసీఆర్ కరోనా రోగులున్న ఆసుపత్రులను సంద ర్శించి, బాధితులకు ధైర్యాన్నిస్తుంటే, ఈముఖ్యమంత్రి ఎందుకు బయటకురావడంలేదన్నారు.  ఇప్పుడున్న పరిస్థి తుల్లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే, రాష్ట్రంలో ఇన్నిమరణాలు సంభవించేవికావని ప్రజలే చెప్పు కుంటున్నారన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆసుపత్రుల్లోసక్రమంగా వైద్యసేవలు అందేవని, భవననిర్మా ణ కార్మికులు, ప్రైవేట్ టీచర్లకు రూ.10వేల సాయం చేసేవార ని,  అన్నాక్యాంటీన్లు తెరిపించేవారని రాష్ట్రమంతా అనుకుం టోందనని ఆంజనేయులు స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మొద్దునిద్ర వీడి ప్రజలప్రాణాలు కాపాడాలని, లేక పోతే రాజీనామా చేసి తప్పుకోవాలని మాజీ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల విషయంలోనిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షనేతపై కేసులుపెడుతున్న జగన్ రెడ్డి భవిష్యత్ లోతగినమూల్యం చెల్లించుకుంటాడని ఆంజనేయు లు తీవ్రస్వరంతో హెచ్చరించారు.