శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (08:08 IST)

జనసేనలోకి వంగవీటి రాధా?

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను టీడీపీ నేత వంగవీటి రాధా కలిశారు. అంతకుముందు నాదెండ్ల మనోహర్‌తో రాధా భేటీ అయ్యారు.

ఇటీవల రాధా వైసీపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే రాధాకృష్ణ కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి కూడా ఆయన రాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడు జనసేనానితో రాధా భేటీ కావడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రాధా, పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారా.. లేక జనసేనలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.