సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (08:06 IST)

ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణాకు మూలకారకులైన మెస్త్రీ, పెట్టుబడి పెట్టే ఫైనాన్షియర్ లను టాస్క్ ఫోర్స్ బృందం అరెస్టు చేసింది.

ఇటీవల 27 దుంగలను స్వాధీనం చేసుకున్న కేసుకు కొనసాగింపుగా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ అధ్వర్యంలో విచారణ చేపట్టిన ఆర్ ఐ సత్యనారాయణ, ఆర్ ఎస్ ఐ రవికుమార్ లు తమ బృందం రైల్వే కోడూరు అటవీ ప్రాంతంలో మాటు వేశారు. నలుగురు స్మగ్లర్లు, నాలుగు దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు.

వీరిని లొంగిపోవాలని హెచ్చరించగా దుంగలను పడవేసి పారిపోయారు.వారిని వెంబడించి ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని విచారించగా శెట్టిగుంటకు తాంబర్ల వెంకటేష్ (43) మేస్త్రీ వివరాలు తెలిపాడు, అతని ద్వారా స్మగ్లింగ్ కు ఆర్థికంగా సహకరించే షేక్ జబ్బార్ (32) వివరాలు తెలిపారు.

టాస్క్ ఫోర్స్ వీరిద్దరిని అరెస్టు చేసి విచారణ చేపట్టింది. దీనిపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు మాట్లాడుతూ మేస్తీ, ఫైనాన్షియర్ లను పట్టుకోవడం అరుదని తెలిపారు. దీంతో స్మగ్లింగ్ లోని ఏడు స్టేజిల వరకు వెళ్లామని తెలిపారు. తరువాత స్టేజ్ లో గొడవును కీపర్ ప్రధానమని తెలిపారు.

అతనిని కూడా పట్టుకుంటామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం ను డీఎస్పీ అల్లా బక్ష్ అభినందించారు.