శ్రీవారి ఆలయంలో అన్యమత ప్రచారానికి బ్రేక్.. ఆ వాహనాలకు నో ఎంట్రీ
శ్రీవారి ఆలయంలో అన్యమత ప్రచారానికి బ్రేక్ వేసే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామాగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ దేవస్థానం.
టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు టీటీడీ తెలిపింది. ఇది ఎన్నో దశాబ్ధాలుగా అనుసరిస్తున్న నిబంధన అని, ఇటీవల కాలంలో తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోందని టీటీడీ వెల్లడించింది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.