మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (11:52 IST)

సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 7వ రోజైన శ‌నివారం (ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి)నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీస‌ర‌స్వ‌తీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రానికి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఎంతో విశిష్ట‌త ఉంది. 
 
అందుకే ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి నాడు చ‌దువుల త‌ల్లిగా కొలువుదీరే దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తుతారు. త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముద్ర‌తో స‌ర‌స్వ‌తీదేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.