శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (13:27 IST)

విజయవాడని కనకదుర్గ నగరంగా పేరు మార్చాలి:సూఫీ మత గురువు

చరిత్రాత్మకమైన విజయవాడ నగరాన్ని కనకదుర్గ నగరం మార్చాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు, సూఫి మతగురువులు హజరత్ మొహమ్మద్ ఆల్తాఫ్ రజా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పుష్కరాలు, దుర్గా ప్లైఓవర్ సందర్భంగా కుల్చివేసిన దేవాలయలను,చర్చీలను వెంటనే పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు.
 
అందులో భాగంగా 450 సంవత్సరాల చరిత్ర గల విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలో వున్న హజరత్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ , హజరత్ హుస్సేన్ షా ఖాద్రీ దర్గాలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.

మత సమరస్యాలకు నెలవైన విజయవాడ నగరంలోని ప్రజలు రాష్ట్ర నలుమూలలనుండి కుల మతాలకూ అతీతంగా450 సంవత్సరాల నుండి ఆ దర్గాలను దర్శించి ప్రార్థనలు చేస్తున్నారని గత నాలుగు సంవత్సరాల క్రితం పుష్కరాలు సందర్భంగా రోడ్లను నిర్మించారని, అందువలన అతి పవిత్రమైన దర్గాల లోపలకు డ్రైనేజీ నీరు,వర్షపు నీరు ప్రవేశించి నమాజు కూడా చేయలేని దుస్థితి నెలకోందని అన్నారు.
 
దర్గా లోపలికి వెళ్ళే దారికూడ ఏర్పాటు చేయకుండా గోడలు కట్టేశారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత నాలుగు సంవత్సరాల క్రితం దర్గా తొలగింపుకుకు నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుట్ర జరిపిందని, దానని హైకోర్టులో అడ్డుకున్నామని అన్నారు. పిమ్మట 68.75 లక్షల రుపాయలు దర్గా అభివృద్ధికై కేటాయింపు జరిపి పైసా ఖర్చు పెట్టలేదన్నారు.
 
ఏమి చేయలేని పరిస్థితిలో డ్రైనేజీ వాటర్ వర్షపు చొచ్చుకు వస్తుదని ఆవేధన వ్యక్తం చేశారు.ఆ విషయమై ఉపముఖ్యమంత్రి ,మైనారిటీ శాఖా మంత్రి అంజాద్ బాషా దృష్టికి తీసుకెళ్ళగా ఆయన స్పందించి తక్షణమే జిల్లా కలెక్టర్, వక్ఫ్ బోర్డు సిఇఓ, ఆర్ అండ్ బి దృష్టికి తీసుకళ్ళారని, సాక్షాత్తు మైనారిటీ శాఖా మంత్రి అంజాద్ బాషా చెప్పినా పట్టించుకోలేదన్నారు.శాంతియుతంగా నాయకులకు,అధికారులకు  వినతి పత్రలను సమర్పిస్తున్నమని చులకనగా చూడవద్దని హెచ్చరించారు.
 
బాబా భక్తులు కులమతాలకు అతీతంగా ఉధ్యమిస్తారని అన్నారు.అధికారులు తక్షణమే స్పందించి దర్గాలకు కేటాయించిన ఫండ్ తో దర్గాలకు దారులు ఏర్పాటు చేసి ప్రార్థనలు  చేసుకునే విధంగా అభివృద్ధి చేయాలని కోరారు.దర్గాల అభివృద్ధికై హజ్రత్ బాబా భక్తులు ప్రాణత్యాగాలకైన సిద్దమని అన్నారు.