ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By రామన్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:17 IST)

వాటర్ బాటిల్ అడిగిన విద్యార్థి - యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి

acid
విజయవాడ నగరంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యంగా నడుచుకున్నారు. వాటర్ బాటిల్ అడిగిన విద్యార్థికి యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఆ విద్యార్థి కూడా గమనించకుండా యాసిడ్‌ను తాగేసింది. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ నగరానికి చెందిన కోసూరు చైతన్య అనే విద్యార్థి లయోలా కళాశాలలో ఏవియేషన్ విభాగంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఎనికేపాడు వద్ద ఓ దుకాణంలో వాటర్ బాటిల్ కొన్నాడు. దుకాణ యజమాని వాటర్ బాటిల్‌కు బదులుగా యాసిడ్ నింపి ఉన్న బాటిల్‌ను ఇచ్చేశాడు. 
 
మంచి దాహంతో ఉన్న చైతన్య వెంటనే తాగేశాడు. తాగింది యాసిడ్ అని తెలుసుకునే సరికే అది లోపలికి వెళ్లిపోయింది. విలవిల్లాడిన చైతన్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యాసిడ్ తన ప్రభావం చూపించింది. శరీరంలోని అవయవాలు స్వల్పంగా పాడయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.