సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (12:03 IST)

వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు

avinash reddy
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పులివెందులలోని అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులు వెళ్లి అందజేశారు. మార్చి ఆరో తేదీ సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు.
 
మరోవైపు, ఈ నోటీసులపై అవినాశ్ రెడ్డి స్పందించారు. తాను సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐ అధికారులకు స్పష్టంచేశారు. అయితే, ఆరో తేదీన ఖచ్చితంగా విచారణకు వచ్చితీరాల్సిందేనంటూ సీబీఐ అధికారులు హుకుం జారీచేశారు. 
 
మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి ఇచ్చిన నోటీసులు జారీ చేయగా, తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ అధికారులు సూచించారు. అయితే, అవినాశ్ రెడ్డి విచారణ హైదరాబాద్ నగరంలోనూ, భాస్కర్ రెడ్డి విచారణ పులివెందులలోనూ జరుగనుంది.