గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (15:36 IST)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి యేడాది... 23న రాష్ట్ర బంద్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి వచ్చే నెల 12వ తేదీకి ఒక యేడాది పూర్తికానుంది. దీంతో వచ్చే నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. 
 
ఇదే అంశంపై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఒక ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12వ తేదీకి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్టు సమితి ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని చెప్పారు. కేంద్రం వెనక్కి తగ్గేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టుడిస్తామని తెలిపారు. అలాగే, ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు.