ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు..!

Votes
జె| Last Modified మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:46 IST)
అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు. ఈ గ్రామంలో సగం ఇళ్ళకు పైనే ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఉంటుంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.

కులానికి గానీ, వర్గానికి గానీ, డబ్బులకుగానీ లొంగకుండా మేము ఓటు వేస్తామంటూ ఈ ఊర్లో రాసి ఉంటుంది. అందుకే రాజకీయ నేతలు కూడా ఇప్పటికీ ఈ ఊర్లోకి
వెళ్ళాలంటేనే భయపడుతుంటారు.

ఓటు కోసం ప్రచారం చేయరు. వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించరు. పది సంవత్సరాల నుంచి ఈ ఊర్లో అలాగే సాగుతోంది. అందరూ చైతన్యవంతులే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు చేసే పనులు మీకు తెలిసిందే. పెద్దగా ఆ విషయాన్ని చెప్పనక్కర్లేదు. ఓటరు మేలుకో. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్థంగా నీతి నిజాయితీగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే మంచిదన్నదే కదా.దీనిపై మరింత చదవండి :