సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (13:21 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సందడి.. భద్రత కట్టుదిట్టం

సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సందడినెలకొనివుంది. అలాగే, ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. 
 
గురువారం ఉదయం తొలుత పోస్టల్ ఓట్లు లెక్కింపు చేపడుతారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఉదయం 8.30 గంటలకు మొదలుపెడతారు. కౌంటింగ్‌ కోసం 25 వేల మంది సిబ్బందిని నియమించారు. పలు నియోజకవర్గాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సరాసరి 18 నుంచి 20 రౌండ్లలో ఒక్కో నియోజకవర్గం ఫలితం వెలువడే అవకాశం ఉంది. 
 
అయితే ఈ సారి వీవీప్యాట్‌ స్లిప్పులు కూడా లెక్కపెట్టాల్సి ఉండటంతో.. ఈవీఎంల కౌంటింగ్‌ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 వీవీ ప్యాట్లు లెక్కిస్తారు. ఆ ప్రకారంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1750 వీవీప్యాట్లు లెక్కించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో వీవీప్యాట్‌ లెక్కింపు సుమారు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. 
 
ఈవీఎంలు, వీవీప్యాట్ల లెక్కల్లో తేడా వస్తే రీ కౌంటింగ్‌ చేపడతారు. ఒకవేళ అప్పుడు కూడా తేడా వస్తే.. చివరకు రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం మేరకు.. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కే తుది ఫలితంగా వెల్లడించనున్నారు. ఇదిలావుంటే, కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో నిఘాను పటిష్టం చేశారు. సెంటర్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రతలో 15 పారామిలిటరీ బలగాలు పాల్గొంటున్నాయి.