గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (18:21 IST)

పవన్ కల్యాణ్ ఫోన్ చేసినా పట్టించుకోని వామపక్షాలు, జనసేన ర్యాలీకి డుమ్మా

విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్​మార్చ్​కు వామపక్షాల మద్దతు ప్రకటించాయి. కానీ ప్రత్యక్షంగా ర్యాలీ పాల్గొనలేమని ఓ ప్రకటనలో ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు.

తమను ఆహ్వానించినందుకు పవన్​కు ధన్యవాదాలు తెలిపారు. భాజపా సహకారం తీసుకోవడానికి జనసేనకు అభ్యంతరం లేకపోవడం... తమకు ఆమోదయోగ్యం కాదని లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో రేపు... జనసేన తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

ప్రత్యక్షంగా పాల్గొనబోమని చెప్పాయి. ఇసుక సమస్యపై నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సీపీఐ, సీపీఎంలను ఆహ్వానించినందుకు... ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు.

జనసేన నిరసనకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి భాజపా సహకారం తీసుకోవడానికి... జనసేన పార్టీకి అభ్యంతరం లేదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని... ఈ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో వామపక్ష నేతలు పేర్కొన్నారు.

అందువల్ల జనసేన ర్యాలీకి హాజరుకాలేకపోతున్నామని స్పష్టం చేశారు. కాగా తాను తలపెట్టిన ర్యాలీకి రావాల్సిందిగా... పవన్​కల్యాణ్ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు నేరుగా ఫోన్‌ చేశారు.