ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:28 IST)

డిజిటల్ టెక్నాలజీని గ్రామస్థాయి వరకు చేరుస్తాం: మంత్రి గౌతమ్ రెడ్డి

సమానత్వం, నైపుణ్యంతో కూడిన విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఐటి శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 
 
విజయవాడ నగరంలో సిఎక్స్ ఓ రౌండ్ టేబుల్ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రంగానికి ఐటి వెన్నుముఖలా నిలుస్తుందన్నారు. సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని మనందరం ఎంతో నేర్చుకోవలసి ఉందని వాటి పై చర్చించేందుకే కలిశామన్నారు.

కరోనా విపత్కర సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ఐటి సమ్మేళనంలో భాగస్వామ్యమై మీ ఆలోచనలు, మీ సూచనలు పంచుకోవడానికి రావడం ఆహ్వానిస్తున్నామని ఇందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.

ఇటువంటి వేదికల ద్వారా మేథో సమ్మేళనంకు అవకాశం కల్పిస్తుందన్నారు . ఐటితో ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని, 5 సంవత్సరాల కాలంలో చేపట్టే పనులను ఐటి సాంకేతిక పరిజ్ఞానంతో 5 నెలల్లోనే ఒక రూపు తీసుకువస్తున్నామన్నారు.

లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాకారం చేసే దిశలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశంలో అడుగులు వేస్తున్నామన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, నైపుణ్య రంగాల్లో ఐటిని అనుసంధానం చేస్తూ మరింతగా ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

2019 ప్రభుత్వం వచ్చిన నాటి నుండి క్షేత్రస్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్లగలిగామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి దార్శనిక ఆలోచనలే ఎన్నో సంస్కరణలు చేపట్టడానికి కారణంగా నిలిచాయన్నారు.

నేరుగా ప్రజలకు సేవలందించే ఆలోచనా దిశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇటువంటి మేధోమధనం కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు భాగస్వామ్యమై వారి అనుభవాన్ని పంచుకోవడం పట్ల మంత్రి గౌతమ్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశలో గ్రామ సచివాలయ వ్యవస్థ వరకు టెక్నాలజీని తీసుకు వెళ్లి ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న  గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలతో పాటు  డిజిటల్ లేబరే టరీలుగా తీర్చిదిద్దే దిశలో 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.

ఐటి పాలసీని అన్ని అంశాలకు విస్తరింప చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. సాధారణ విద్యాభ్యాసంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనగా డిగ్రీ కోర్సును మూడు సంవత్సరాల బదులు నాలుగు సంవత్సరాలుగాను, ఉన్నత విద్యా కోర్సుల్లో కూడా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

25 కంపెనీలతో సమ్మేళనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లిన తెలుగు పారిశ్రామిక వేత్తలతో నిర్వహించాలనుకున్నామన్నారు. అయితే విశేష స్పందన లభించి 16 సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. ఈ రోజు సదస్సుకు 53 మంది నేరుగాను, 10 మంది వర్చువల్ ద్వారా పాల్గొన్నారన్నారు.

కోవిడ్ సమయంలో కూడా ముందుకు వచ్చి పాల్గొన్న ఆ సంస్థ ఎండిలను, సిఇఓలను మంత్రి అభినందించారు. వారి సలహాలు, సూచనలు కోరుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు.

మూడవ తరగతి నుండే విద్యాబోధనలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్నామన్నారు. విద్యా, ఆరోగ్యం , వ్యవసాయ రంగాలలో వీటిని అనుసంధానం చేస్తూ నైపుణ్యాభివృద్ధి కోర్సులను అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఐటి రంగానికి ఎక్కుమంది నిపుణులను అందిస్తున్న రాష్ట్రం ఏపి అన్నారు. ఇక్కడ ఐటి అనుబంధ రంగాల పరిశ్రమలను ఏర్పాటు కీలకమని , అన్ని రంగాలకు ఐటి విస్తరించి ఉందన్నారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఏపి స్వాగతిస్తుందని వారుకూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఐటితో పాటు ఇతర రంగాల్లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు . విశాఖపట్నాన్ని ఐటి డెస్టినేషన్ గా రూపుదిద్దుతున్నామని ఇక్కడ అందుకు తగ్గ అవకాశాలున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

52 ఆర్టిఫిషియల్ ఇంటెల్ జెన్స్ రోబోటిక్స్ జెనిటిక్స్ రంగాల్లో పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు . ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతతో కూడిన వనరులు సమృద్ధిగా ఉన్నాయని ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందించేందుకు స్కిల్ డవలప్ మెంట్ యూనివర్శిటీలు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు .