శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (11:43 IST)

ఇంటి అద్దె అడిగాడనీ యజమానిని కొట్టి చంపేశారు... ఎక్కడ?

ఇటీవలి కాలంలో అకారణంగానే కొందరు దారుణ నేరాలకు పాల్పడున్నారు. క్షణికావేశంలో చేస్తున్న ఈ హత్యల తర్వాత ముద్దాయిలు జీవితాంతం బాధపడుతుంటే, తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుతోంది. 
 
తాజాగా వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని కిరాయి అడిగినందుకు యజమాని హత్యకు గురయ్యాడు. ముచ్చర్లవారి వీధిలోని వంగా ప్రసాద్‌(50) అనే వ్యక్తి ఇంట్లో ఒక యేడాదిగా చినకొండయ్య అనే వ్యక్తి కుటుంబం అద్దెకు ఉంటోంది. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. 
 
ఈ విషయమై ఇంటి యాజమాని, చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో యజమాని తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.