శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (07:06 IST)

పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు : ఏమిటీ నాగబంధం - కూర్మావతారం?

pawan kalyan
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కుడి చేతికికి రెండు ఉంగరాలు ఉన్నాయి. వీటిపై తెగ చర్చ జరుగుతుంది. ఈ రెండు ఉంగరాల్లో ఒకటి నాగప్రతిమ కాగా, రెండోది తాబేలు ప్రతిమతో కూడిన ఉంగరం. పవన్ జాతకరీత్యా ఆ ఉంగరాలు చాలా పవర్‌ఫుల్ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో ప్రసంగించే సమయంలో ఈ ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వీటిపై ఓ జాతక నిపుణుడు స్పందిస్తూ, 
 
"పవన్ కళ్యాణ్ జాతకపరంగా చూస్తే ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2వ తేదీ కుజ రాహువు సంధి, రాహు కేతువుకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి. ఆయనది మకర రాశి. మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు, చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ కుజ రాహువు సంధి ప్రభావం ఉండవల్ల వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం. జాతకపరంగా ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలు ఇస్తాయి. 
 
కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు, నర ఘోర, నర దృష్టి ఎక్కువగా ఉన్నవారు, రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారు. రెండోది కూర్మావతార ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగివుంది. ఎదుగుదలకు, అధికారానికి ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు అని ఆయన వివరించారు.