బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 13 మే 2021 (18:44 IST)

మాకు చెప్పకుండా నరేంద్రను ఆసుపత్రి నుంచి జైలుకు ఎందుకు తీసుకెళ్లారు: ఏసిబి కోర్టు ఆగ్రహం

రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి దూళిపాళ్ల నరేంద్రను తీసుకువచ్చారు. కోవిడ్ తగ్గిందని నిన్న సాయంత్రం విజయవాడ హాస్పిటల్ నుంచి దూళిపాళ్లను రాజమండ్రికి తరలించారు పోలీసులు.
 
ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజమండ్రి జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి నరేంద్రను తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ఈసారి ఆసుపత్రి నుంచి జైలుకు తరలించవద్దని ACB కోర్ట్ ఆదేశించింది. తమకు సమాచారం ఇవ్వకుండా నరేంద్రను జైలుకు తరలించడంపై పోలీసులపై ఏసిబి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.