YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)
తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)తో తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్నారు మధుమతి తల్లిదండ్రులు. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.
అదేవిధంగా లక్షల్లో సబ్‌స్కైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది.
అయితే ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో తమ కుమార్తెను ప్రతాపే వెంట తీసుకెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఉరేసి చంపేశాడని ఆరోపణలు వున్నాయి.