సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (16:43 IST)

ఏపీలో అధికార వైకాపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ysrcp flag
ఏపీలో అధికార వైకాపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. వైఎస్సార్సీపీ పేరు మారు పెట్టారు. తొలుత NFT Millionarie పేరుతో ట్విట్టర్ ఖాతాను మార్చేశారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మార్చారు. లొకేషన్ యూఎస్ అని చూపిస్తోంది. హ్యాకర్లు రాత్రి నుంచి పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తుండడంతో నెటిజన్లకు అర్థం కాలేదు. అధికారంలో వున్న పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
వైసీపీకి సంబంధించి ప్రొఫైల్ పిక్, కవర్ ఫొటో, బయోడేటాను మార్చేశారు. ఇప్పటికే ట్విట్టర్ యాజమాన్యానికి వైఎస్సార్సీపీ ఐటీ విభాగం సిబ్బంది కంప్లైంట్ చేశారు. ఇందుకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు నెలల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.