గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (12:58 IST)

వైఎస్సార్ వాహన మిత్ర పథకం.. నాలుగో విడతగా రూ.261.51 కోట్లు

ys jagan
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగో ఏడాది కూడా అందించనుంది. వైయస్ఆర్ వాహన మిత్ర.. డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261.51 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 
 
ఇందులో భాగంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. వైయస్ఆర్ వాహనమిత్ర కింద నేడు అందిస్తున్న రూ.261.51 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం మొత్తం రూ. 1,026 కోట్లు సాయంగా అందించింది.
 
రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  తమ బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు జగనన్న ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది.
 
2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్‌ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కల్పించనుంది. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసినట్లవుతుంది.
 
ఇక వైయ‌స్సార్‌ వాహనమిత్ర పంపిణీ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు.