1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (20:37 IST)

ఉద్యోగ సంఘాలపై సజ్జల ఫైర్: సమ్మెకు దిగి ఏం సాధిస్తాయ్!?

ఉద్యోగ సంఘాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యోగ సంఘాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. 
 
సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు. సమ్మె అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కరిద్దామని చెప్పామని.. ఆ విధంగా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని సజ్జల సూచించారు. సమస్యలుంటే పాయింట్ల వారిగా చెప్పాలని కోరారు. సమ్మె అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కరిద్దామని చెప్పామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి ఆహ్వానించి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 
 
ఉద్యోగులు ఇచ్చిన మూడు డిమాండ్స్‌లో రెండు అయిపోయాయి.. వెనక్కి వెళ్లడం కుదరదన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే తీర్చడానికి అవకాశం లేని డిమాండ్స్ అడుగుతున్నారని సజ్జల వెల్లడించారు.