ఎవరి కోసం గురజాలలో ధర్నాకు పిలుపునిచ్చారు కన్నాగారూ...

kasu mahesh reddy
ఎం| Last Updated: సోమవారం, 12 ఆగస్టు 2019 (19:06 IST)
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఎవరి కోసం గురజాలలో ధర్నాకు పిలుపునిచ్చారని, యరపతినేని అతని అనుచరుల కోసమే కన్నా ధర్నా చేస్తున్నాడా? అని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. గురజాలలో ఏ బీజేపీ కార్యకర్త మీద దాడి జరగలేదు.. కేసు పెట్టలేదని గుర్తు చేశారు.

పల్నాడు ప్రశాంతంగా ఉంది.. ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పల్నాడులో గతంలో లాగా అక్రమ మైనింగ్, గంజాయి రవాణ జరగడం లేదన్నారు. కన్నా టీడీపీ నుంచి వచ్చిన వారి మాటలు కాకుండా స్వచ్ఛమైన బీజేపీ నేతలను విచారించి వాస్తవాలు తెలుసుకోవాలని కాసు మహేష్‌రెడ్డి సూచించారు.దీనిపై మరింత చదవండి :