మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (13:58 IST)

మండలికి ఎసరు? పూల ఖర్చులు వృథా : విజయసాయి రెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన శాసనమడలిని రద్దు చేయాలన్న తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. 
 
"శాసన మండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట అని ఎద్దేవా చేశారు. రాజధాని సంగతి దేవుడెరుగని... ఇప్పుడు మండలికే ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని అన్నారు. పూల ఖర్చు వృథా అయినట్టేనా? అని దెప్పిపొడిచారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టుముట్టిందేమిటి విజనరీ?" అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.