ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-04-2024 ఆదివారం దినఫలాలు - మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు...

Rishabham
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| చతుర్ధశి రా.2.47 పూర్వాభాద్ర ఉ.11.50 రా.వ.8.46 ల 10.15. సా.దు. 4.31 ల 5.20.
 
మేషం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. కష్ట సమయంలో ఆత్మీయులు చేదోడు వాదోడుగా నిలుస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభించలేకపోతారు. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును.
 
మిథునం :- మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. మీ ఆశ నెరవేర్చుకోవడానికి ఇదేసమయం. ఇంటా, బయట కొన్ని కొత్తసమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
కర్కాటకం :- దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు. విందు, వినోదాలల్లో చురుకుగా పాల్గొంటారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కార్యసాధనలో అనుకూలత, ప్రత్యర్థివర్గాలపై విజయం సాధిస్తారు.
 
కన్య :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు పని భారం తగ్గడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. వేళ తప్పి భోజనకం, శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాల పట్ల, వస్తువులపట్ల ఆశక్తి అధికమవుతుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. వారసత్వపు వ్యవహారాలలో చికాకులుతప్పవు.
 
వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్త్రీలకు ఆరోగ్యమలో తగు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ లక్ష్యాన్ని చేరుకొనే విషయంలో మెళకువలు అవసరం. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు.
 
మకరం :- రాజకీయాల వారు కార్యకర్తల అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ పనివారలకు కలిసివచ్చేకాలం.
 
కుంభం :- మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. పారిశ్రామిలకులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
మీనం :- అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానిక్ మీడియా వారు ఊహించని సంఘటన లెదుర్కుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి.