బుధవారం, 12 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-03-2025 బుధవారం రాశిఫలాలు - దంపతుల మధ్య అకారణ కలహం...

Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. బంధువులు రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడొద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. నోటీసులు అందుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అపనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, ఉంది. ఖర్చులు అధికం. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలతో సతమతమవుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కీలక అంశాలపై దృష్టి పెడతారు. పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పత్రాలు అందుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల కొందరికి స్ఫూర్తినిస్తుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. వ్యవహారాల్లో ఏ వహించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. మీ శ్రీమతి వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పొదుపు ధనం అందుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకను ఘనంగా చేస్తారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. మీ జోక్యం అనివార్యం. వాహనం ఇతరులకిచ్చి అవస్థపడతారు.