గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (10:55 IST)

01-08-2022 నుంచి 31-08-2022 వరకు మాస ఫలితాలు (video)

horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం యోగదాయకం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. రుణ సమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వెండి, బంగారు వ్యాపారులకు పరోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
అన్ని రంగాల వారికీ అనుకూలమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. వినూత్నమైన మీ ఆతిధ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. వ్యవహార ఒప్పందాలకు తగిన సమయం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్పలితమిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
అనుకూలతలు అంతంతమాత్రమే. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. గృహ మరమ్మతులు చేపడతారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వెండి, బంగారం, వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఈ మాసం ఆశాజనకం. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం కార్యోన్ముఖులను చేస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆర్థిక స్థితి ఆశాజనకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులను విశ్వసించవద్దు. ప్రలోభాలతో కొంతమంది మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. తరుచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 


 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. కార్మికులు, చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. ఓర్పుతో వ్యవహరించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మనస్థిమితం ఉండదు. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. గృహ వాతావరణం చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగాలి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. స్థిరచరాస్తుల వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. వస్త్ర, బంగారు వ్యాపారులకు ఆశాజనకం. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. కిట్టని వారు తప్పుదారి పట్టిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆప్తులతో కాలక్ష్మేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికారులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అధికారులకు కొత్త బాధ్యతలు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికుం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. పరిచయాలు బలపడతాయి. మీసాయంతో ఒకరికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. గృహనిర్మాణాలకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
సంప్రదింపులకు తగిన సమయం. వ్యవహారాలు అనుకూలిస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు అధికంగా వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆధ్మాత్మికత ఆసక్తి పెంపొందుతుంది. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.