శనివారం, 2 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: బుధవారం, 21 అక్టోబరు 2015 (21:26 IST)

మీ కుమారుడిది మీది ఏక నక్షత్రం... శాంతి చేయించండి...

హేమలత-అనంతపూర్: మీరు విదయ శుక్రవారం, కన్యాలగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. రాజ్య లేక ఉద్యోగాధిపతి అయిన బుధుడు చతుర్థము నందు ఉండటం వల్ల మీరు టెక్నికల్ రంగాలలో బాగుగా రాణించి ఐటీ ఫీల్డులో మీకు అవకాశాలు లభిస్తాయి. ప్రతిరోజూ సంకల్పసిద్ధి గణపతిని పూజించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. 2013 ఆగస్టు నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు 61 శాతం యోగాన్ని ఇవ్వగలడు. ఈ శుక్రుడు 2016 డిసెంబరు నుంచి 2023 వరకూ దినదినాభివృద్ధిని ఇస్తాడు. ఉద్యానవనాల్లో పిప్పలి చెట్టును నాటండి శుభం కలుగుతుంది.
 
మీ కుమారుడు...
విదియ మంగళవారం, ధనుర్ లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. మీది మీ కుమారుడిది ఏక నక్షత్రం, ఏక రాశి అవ్వడం వల్ల ఏకనక్షత్రం దోష శాంతి చేయించండి. ఈ ఏక నక్షత్ర దోషం వల్ల చదువుల్లో ఏకాగ్రత లోపం, అతి మొండివైఖరి అవలంభించడం, చికాకులు వంటివి ఉండగలవు. చిరంజీవి 15 సంవత్సరము నుంచి చదువుల్లో బాగుగా రాణించి సాంకేతిక రంగాల్లో ఏకాగ్రత వహించి అభివృద్ధి చెందుతాడు. ప్రతిరోజూ విద్యాగణపతిని పూజించడం వల్ల, విద్యాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.