2016 ఆగస్టు నుండి 2017 డిశెంబరు లోపు మీకు వివాహం(డి.కుమార్-చెన్నై)

Raman| Last Modified శుక్రవారం, 3 జూన్ 2016 (17:35 IST)
డి.కుమార్-చెన్నై: మీరు తదియ, బుధవారం, మీన లగ్నం, భరణి నక్షత్రం, మేష రాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, మల్లెపూలతో శనిని పూజించి అర్పించిన దోషాలు తొలగిపోతాయి. లగ్నము నందు గురు, రాహువు, రవిలు ఉన్నందువల్ల, భార్య స్థానము నందు కేతువు ఉన్నందువల్ల వివాహా ప్రతిబంధకా దోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది.

2016 ఆగస్టు నుండి 2017 డిశెంబరు లోపు మీకు వివాహం అవుతుంది. పడమర నుండి గాని, దక్షిణం దిక్కు నుండి గాని సంబంధం స్థిరపడుతుంది. 2016 సెప్టెంబరు నుండి కుజమహర్దశ ప్రారంభమవుతుంది. ఈ కుజుడు 7 సంవత్సరములు, తదుపరి రాహుమహర్దశ 18 సంవత్సరములు మొత్తం 25 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని పొందుతారు. ప్రతిరోజూ మహాగణపతిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యానవనాల్లో దేవదారు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.

గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.దీనిపై మరింత చదవండి :