శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2021 (23:38 IST)

07-02-2021 నుంచి 13-02-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. వ్యాపకాలు అధికమవుతాయి. ఆది, సోమ వారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. ఆశించిన పదవులు దక్కవు. గుట్టుగా వ్యవహరించండి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహమార్పు నిదానంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు అమలుచేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఇరువర్గాలకు ఆమోదయోగ్యమవుతుంది. ఏ సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది వుండదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మంగళ, బుధ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి వుండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా వుండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆహ్వానం అందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యంకావు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. పందాలు, బెట్టింగుల జోలికి వెళ్లవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ఓర్పునేర్పులకు పరీక్షా సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. శని, ఆది వారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిడి, ధన ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత వుంది. వాగ్దాటితో రాణిస్తారు. ఎదుటివారికి మీ సమర్థతపై గురి కుదురుతుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సోమ, మంగళ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకమే. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. స్వల్ప అస్వస్తతకు గురవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. గృహ మరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. వేడుకలు, పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారాలకు సామాన్యం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం, షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
అన్ని రంగాల వారికి శుభదాయకమే. లక్ష్యాన్ని సాధిస్తారు. వివాహ యత్నం ఫలిస్తుంది. బంధుత్వాల బలపడతాయి. పెట్టిపోతల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి వుంచి ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల కలిసివస్తాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులు ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. కళ్యాణ వేదికలను అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాయిదా పడుతూ వచ్చిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. శుక్ర, శని వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధన సహాయం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు, ఉద్యోగలకు పనిభారం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్దికి అవిశ్రంతగా శ్రమస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. లౌక్యింగా సమస్యలు పరిష్కరించుకోవాలి. కొత్త సమస్యలెదరయ్యే సూచనలున్నాయి. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయా వ్యయాలకు పొంతన వుండదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆప్తుల కలయిక ఉపశనం కలిగిస్తుంది. గురు, శుక్ర వారాలలో పనులు సాగక విసుగు చెందుతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ భాద్యల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. నిస్తేజానికి లోనవుతారు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. మిత్రులే వ్యతిరేకులవుతారు. రావాలసిన ఆదాయంలో కత్త మొత్తం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల సానుకూలతకై మరిత శ్రమించాలి. శనివారం నాడు ముఖ్యల కలయిక వీలుపడదు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమచారం ఉపశమం కలిగిస్తుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. అకౌంట్స రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆదాయా వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపుచేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.