శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 31 జులై 2021 (23:11 IST)

01-8-2021 నుంచి 07-8-2021 వరకు వారఫలాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పట్టుదలతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించివద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆది, సోమవారాల్లో ఆచితూచ వ్యవహరించాలి. ఇంటి విషయాలు పట్టించుకోండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శుభకార్యయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగండి. శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. కొత్త అధికారులతో జాగ్రత్త. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మంగళ, బుధవారాల్లో ఖర్చులు అదుపులో వుండవు. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ప్రతిభాపాటవాలు  వెలుగులోకి వస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆది, గురువారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆహ్వానం అందుకుంటాు. ఆరోగ్యం మందగిస్తుంది, సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపార లావాదేవీల్లో మెలకువ వహించండి. షాపు పనివారల తీరు అసహనం కలిగిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ధనయోగం. కార్మికులు, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కష్టం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం ప్రియతములను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
శ్రమించినా ఫలితం వుండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆదివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఆర్థిక సమస్యలతో  సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఏ విషయంపై ఆసక్తి వుండదు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితులు సాయం అందిస్తారు. అవసరాలు నెరవేరుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. బాధ్యతలు, ఇతరులకు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. అపరిచితులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. ప్రత్యర్థుల వైఖరిలో మార్పు వస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ జోక్యంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. మీ ఉన్నతిని చాటుకునేందుకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు 
ప్రతి వ్యవహారం మీకే అనుకూలిస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ధనలాభం వుందియ ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పోయిన పత్రాలు సంపాదిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు పురోభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. కార్మికులకు కష్టకాలం. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా వుండండి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ఆర్థికంగా పురోగమిస్తారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు వేగవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంప్రదింపులతో తీరిక వుండదు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు శుభయోగం. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. వేడుకకు హాజరవుతారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు రాణిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. పట్టుదలకు పోవద్దు. పరిచయస్తులను కలుసుకుంటారు. ఇంటి విషయాలు వెల్లడించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతులు ఆలోచనలు పరస్పర విరుద్ధంగా వుంటాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. ఖర్చులు విపరీతం. వెండి, బంగారం కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మంగళ, గురువారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. లౌక్యంగా వ్యవహరించాలి. ఆప్తుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఉపాది ఫథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
వ్యవహార జయం, ధనప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు ప్రయోజనకరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సూచన ఆమోదయోగ్యమవుతుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభూతినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. మార్కెట్ రంగాల వారికి కొత్త చికాకులెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనచోదకులకు దూకుడు  తగదు.