1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (20:00 IST)

16-06-2024 నుంచి 22-06-2024 వరకు మీ వార ఫలితాలు

weekly astro
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచాచం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు. అప్రమత్తంగా ఉండాలి. అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులకు స్థానచలనం. సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రముఖులకు చేరువవుతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల కోసం వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. సంస్థల స్థాపనలకు యత్నాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బుధ, గురు వారాల్లో ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పాతమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సష్టంగా తెలియజేయండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆదివారం ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతనం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పబలంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తుల సలహా తీసుకోండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. పత్రాల్లో సవరణలు అనుకూలించవు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడగులేస్తారు. మీ నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. శుక్ర, శని వారాల్లో కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. విమర్శలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభఫలితాలున్నాయి సంప్రదింపులు ఫలిస్తాయి. కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆదివారం నాడు వాగ్వాదాలకు దిగివద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందుతుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహ మరమ్మతులు, నిర్మాణాలు ముగుస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. సామరస్యంగా మెలగండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. తలపెట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. విదేశాల్లోని ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులకు తరుణం కాదు. ఆది, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహనదారులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఆచితూచి వ్యవహరించాలి. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సోమవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. రిటైర్డు అధికారుకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రముఖుల సమక్షంలో ఇతరుల ప్రస్తావన తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ధనయోగం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు స్థానచలనం. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థుల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం యోగదాయకం. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం బాగుంటుంది. రుణ విముక్తులవుతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రియతములతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. శుభకార్యానికి హాజరవుతారు.