గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 9 జులై 2022 (16:08 IST)

10-07-2022 నుంచి 16-07-2022 వరకు మీ వార రాశి ఫలితాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము 
మీ ఓర్పునకు పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మంగళ, బుధ వారాల్లో పను శకునాల ప్రభావం అధికం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
మీ మాటకు తిరుగుండదు. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురు, శుక్ర వారాల్లో చెల్లింపుల్లో మెలకువ వహించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు సరిదిద్దుకుంటారు. కార్మికులకు పనులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
వేడుకను ఆర్బాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికం, ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవాలిసి వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ద్విచక్ర వాహనచోదకులకు సమస్యలెదురవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
సమర్ధతను చాటుకుంటారు. పదవులు వరిస్తాయి. బాధ్యతగా ఉండాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బుధ, గురు వారారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వేడుకలకు హాజరవుతారు.
 
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఇంటి పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. సోదరుల మాటతీరు కష్టమనిపిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. శుక్ర, శని వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్య సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఓర్పు, పనియందు ధ్యాస ప్రధానం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారంత అందిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆత్మస్టైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. విమర్శలు పట్టుదలను పెంచుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సోమ, మంగళ వారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. కార్మికులకు పనులు లభిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. పనులు సానుకూలమవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. బుధ, శుక్ర వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. మీ సమర్థత వేరొకరికి కలిసివస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. పనులు హడావుడిగా ముగిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం వాయిదా పడుతుంది. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలతో తీరిక ఉండదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆహ్వానం అందుకుంటారు. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఆదాయానికి తగట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో మెలకువ వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.