గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (19:45 IST)

03-04-2022 నుంచి 09-04-2022 వరకు మీ వార రాశి ఫలితాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఆది, గురు వారాల్లో ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సామరస్యంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. గృహమార్పు అనివార్యం. పాత మిత్రులు తారసపడతారు. గత అనుభవాలు ఉత్తేజాన్నిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. చేతివృత్తులు, కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. వాగ్ధాటితో రాణిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సోమ, మంగళ వారాల్లో వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రారంభోత్సలకు అనుకూలం. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతులకు కత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతోషపరుస్తుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించినంత ఫలితమీయవు, నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతిపనుల వారికి ఆశాజనకం. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండడు. తెలియని వెలితి వెంటాడుతుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గురు, శుక్ర వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
సంప్రదింపులు ఫలిస్తాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది, శని వారాల్లో ఆప్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోలేనేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ప్రతికూలతలు అధికం. చాకచక్యంగా వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. అనుకోని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సోమ, మంగళ వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం ఉన్నత చదువుల పై దృష్టి పెడతారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
వాగ్దాటితో రాణిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. శుక్ర, శనివారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం పై చదువులను ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఉహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయంలో మెలకువ వహించండి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం అసహనం కలిగిస్తుంది. సంయమనం పాటించండి. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికలావాదేవీలతో తలమునకలవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించి భంగపడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఈ వారం ఆశాజనకం. పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. విదేశీయాన యత్నం ఫలిస్తుంది.