శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 జులై 2022 (12:31 IST)

17-07-2022 నుంచి 23-07-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మంగళ, బుధవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. బుధ, గురువారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పట్టుదలతో శ్రమించినగాని పనులు కావు. శుక్ర, శని వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ అశక్తతను అయిన వారు అర్థం చేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపుల స్థలమార్పు అనివార్యం. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అన్ని విధాలా బాగుంటుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆదివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడుల పై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు నిదానంగా పుంజుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం తల పెడతారు. 
 
కన్య, ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
రుణ ఒత్తిళ్లు మనశ్సాంతి లేకుండా చేస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషిస్తారు. సోమ, మంగళవారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు అనివార్యం. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. దైవదర్శనాలు మనోల్లాసం కలిగిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆదాయం ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. బుధ, గురువారాల్లో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహ మరమ్మతులు చేపడతారు. చేతివృత్తులు, కార్మికులకు అవకాశాలు లభిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
అనుకూలతలు నెలకొంటాయి. సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాగాటితో నెటుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. శుక్ర, శనివారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. కార్మికులకు పనులు లభిస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం ఉండదు. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవడం సన్నిహితులు వ్యాఖ్యలు మంచి ప్రభావం చూపుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తుల కదలికలను గమనించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయాగ్యమవుతుంది. ఆది, గురువారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఈ వారం అనుకూలదాయకం. మాట నిలబెట్టుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంభటనలు అనుభూతినిస్తాయి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉపాధ్యాయులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.