శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 16 నవంబరు 2019 (20:59 IST)

17-11-2019 నుంచి 23-11-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు-Video

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. శ్రమ అధికం, ఫలితం శూన్యం. పట్టుదలతో వ్యవహరించాలి. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి అధికం. ప్రముఖుల కలయిక వీలు పడదు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సాయం అడిగేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అనవసర జోక్యం తగదు. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యంలో పాల్గొంటారు. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. గృహంలో స్తబ్దత తొలగుతుంది. కార్యసిద్ధి, వాహనయోగం వున్నాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారుకు హోదా మార్పు, స్థాన చలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడివడి వుంటుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. బంధుత్వాలు బలపడతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యతిరేకులు చేరువవుతారు. శనివారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పరిచయం లేనివారితో జాగ్రత్త. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు అధికం, సంతృప్తికరం. ముఖ్యులకు సాయం అందిస్తారు. నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనుకూలతలున్నాయి. మీ వాక్కు ఫలిస్తుంది. ధనయోగం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఓర్పు, పట్టుదల అవసరం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. 
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు అతి కష్టమ్మీద నెరవేరుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. వేడుకలకు హాజరవుతారు. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదటపడుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారాలను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సాంకేతక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం ఇతురులకిచ్చి అవస్థలెదుర్కుంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యుల కలియిక సాధ్యం కాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. గురు, శుక్రవారాల్లో ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలు అతి కష్టమ్మీద తీరుతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవడం ముఖ్యం. ఎవరినీ నిందించవద్దు. పనులు అర్థంతరంగా నిలిపివేస్తారు. దంపతులకు సఖ్యత లోపిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం విషయంలో శుభ పరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆశావాహ దృక్పధంతో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. శనివారం నాడు తొందరపాటు నిర్ణయాలు తగవు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉద్యోగయత్నం సాగించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దైవ, సేవా కార్యాల్ల పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆలోచనలు నిలకడగా వుండవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. రుణ ఒత్తిడి అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. మీ వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆది, సోమవారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. పెట్టుబడులకు అనుకూలం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. పోయిన వస్తువు లభ్యమవుతాయి. 
 
మకరం: ఉత్తరాషాడ, 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1,2 పాదాలు
ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది వుండదు. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధన సాయం తగదు. మీ ఇష్టాయిస్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. బుధ, గురు వారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగాలి. పంతాకలకు పోవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ధనయోగం, వాహనయోగం వున్నాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. న్యాయ, సాంకేతక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఈ వారం అన్ని రంగాల వారికి శుభదాయకమే. లక్ష్యం నెరవేరుతుంది. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. రశీదులు జాగ్రత్త. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. తొందరపాటుతనం తగదు. పెద్దల సలహా పాటించండి. గృహం ప్రశాంతంగా వుంటుంది. పరిచయాలు వున్నతికి తోడ్పడుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అదుపులో వుండవు. ధన సమస్యలెదురవుతాయి. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. శుక్ర, శనివారాల్లో వ్యవహారాలు, లావాదేవీలతో తీరిక వుండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సన్నిహితులను కలుసుకుంటారు. పనులతో సతమతమవుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పంతాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ప్రయాణం సజావుగా సాగుతుంది.