మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (20:56 IST)

27-10-2019 నుంచి 02-11-2019 మీ వార రాశిఫలాలు -Video

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనలాభం ఉంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. శుక్ర, శని వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పత్రాల రెన్యువల్‌‌లో అలక్ష్యం తగదు. మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. వ్యాపారాలు ఊపందు కుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కొత్త ప్రదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృషభం : కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకలు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. ధనం చేతిలో నిలవదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆది, సోమ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించు కోవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పరిచయంలేని వారితో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పరిస్థితులు మెరుగుపడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఆందోళనకరమైన సంఘటనలెదురవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం వ్యవహారాలతో తీరిక ఉండదు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహం ప్రశాతంగా ఉంటుంది. స్పల్ప అస్వస్థతకు గురవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆహ్వానం, నోటీసులు అందుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్‌‌లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లిడించవద్దు. దంపతుల మధ్య అవగాహన లోపం. సౌమ్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవద్దు. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. ఆత్మీయుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వేడుకలకు హాజరవుతారు.  మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారులకు అనుకూలం. స్టాక్‌‌మార్కెట్ పుంజుకుంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లభిస్తాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
మీ నమ్మకం వమ్ముకాదు. ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. సన్నిహితులను కలుసు కుంటారు. సంప్రదింపులకు అనుకూలం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. గురు, శుక్ర వారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. అప్రమత్తంగా అవకాశాలు కలిసివస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం అడిగేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన వుండదు. పెద్దల సలహా పాటించండి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. పట్టుదలతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అవకాశాలు చేజారిపోతాయి. ఒక సమాచారం నిరుత్సాహ పరుస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు సిద్ధంగా వుంటాయి. చేతిలో ధనం నిలవదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలున్నాయి. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు, ఆరోగ్యం సంతృప్తికరం. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. గృహంలో స్తబ్దత చోటుచేసుకుంటుంది. కావలిసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అప్రమత్తంగా వుండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. బాధ్యతగా వ్యవహరించాలి. సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. కొంత మొత్తం ధనం అందుతుంది. సమస్యలు సద్దుమణుగుతాయి. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సాగక విసుగుచెందుతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి, గురు, శుక్రవారాల్లో వ్యతిరేకులతో జాగ్రత్త. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచన చేయవద్దు. విశ్రాంతి అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త పథకాలు అమలు చేస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కంప్యూటర్, సాంకేతక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాలవారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారి గురించి ఉన్నతంగా ఆలోచన చేస్తారు. వారే మిమ్ములను అర్థం చేసుకోరు. శనివారం నాడు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగిస్తాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆది, సోమ వారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. మనస్థిమితం వుండదు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతగా వ్యవహరించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. అధికారులకు స్థానచలనం.