శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (12:50 IST)

పంచదారతో బరువు అప్.. బెల్లం నీటిని ఖాళీ కడుపుతో తాగితే?

Jaggery And Lemon Water
బెల్లంను పూర్వం ఆహారంలో భాగం చేసుకునేవారు. పానీయాల్లోనూ తరచుగా వాడేవారు. కానీ మారుతున్న కాలం, జీవనశైలితో, బెల్లం ఇంటి వంటగది నుంచి నెమ్మదిగా దూరమైంది. దాని స్థానంలో పంచదార చోటు చేసుకుంది. ఈ రోజుల్లో చక్కెర ఎక్కువగా ఉపయోగించే స్వీటెనర్. పంచదార వాడకం పెరగడంతో మనలో రోగాలు పెరిగిపోయాయి. 
 
ఎందుకంటే బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పంచదారలో పోషకాలు లేనేలేవు. ఆరోగ్యం, పోషక ప్రయోజనాల విషయంలో బెల్లంతో ఏ స్వీట్‌నర్ పోటీపడలేరు. బెల్లంలోని అనేక పోషకాలు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. బెల్లం తినడం వల్ల అనేక వ్యాధులు రాకుండా వుంటాయి. ఇందులో కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
అలాంటి బెల్లంను తెల్లవారుజామున గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఒక పాన్‌లో ఒక గ్లాసు నీటిని వేడి చేసి, దానికి ఒక అంగుళం బెల్లం ముక్క వేయాలి. కలిపి కరిగాక.. చల్లారిన తర్వాత వడకట్టి త్రాగాలి. 
 
బెల్లం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పంచదారతో బరువు పెరుగుతుంది. కానీ బెల్లం తినడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది.
 
బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. బెల్లం కండరాల బలానికి కూడా ఉపయోగపడుతుందని విశ్వాసం.